తిరుమలలో కుమార్తెలతో పవన్ కల్యాణ్(video)
సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కూతుళ్లు కుమారి ఆద్య కొణిదెల, కుమారి పోలెనా అంజనా కొణిదెలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కుమార్తెల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. దర్శనానికి ముందు చిన్న కుమార్తెతో డిక్లరేషన్ చేయించిన పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి మొదటి సారి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె కుమారి పోలెనా అంజలితో స్వయంగా డిక్లరేషన్ ఇప్పించారు.
ఇక దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాకు వారాహి డిక్లరేషన్ ప్రతులను చూపించారు. అలాగే పవన్ కల్యాణ్ కుమార్తెల ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరు క్యూట్‌గా వున్నారని.. దిష్టి తీయాలని అంటున్నారు.