సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (08:12 IST)

విద్యతోనే అభివృద్ధి సాధ్యం: శాసనసభ్యులు అప్పారావు

విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర  ప్రభుత్వం విద్యకు అత్యంత  ప్రాధాన్యతను ఇచ్చి వేలాది కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నదని నూజివీడు శాసనసభ్యులు మేకా  వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు.

స్థానిక ఎస్.ఆర్.ఆర్. హైస్కూల్‌లో జగనన్న విద్యా కానుక పధకంను ప్రాంరంభించి కిట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శాసనసభ్యులు అందించారు.  ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గత ప్రభత్వ హయాంలో విద్య రంగం పూర్తిగా  నిర్లక్ష్యానికి గురైందన్నారు.

సమాజములో పేదరికాన్ని నిర్మూలించి  అభివృద్ధి సాదించేందుకు విద్యే సాధనమన్నారు. రాష్ట్రంలోని ఏ  పేద విద్యార్థి పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదనే సదాశయంతో  ప్రాధమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి విద్య వరకు  అందిస్తున్నామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యతను ఇచ్చి, అమ్మ ఒడి, జగనన్న విద్య కానుక , జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన, నాడు-నేడు,జగనన్న గోరుముద్ద,  వంటి ఎన్నో కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేస్తున్నదన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నిలుపుతున్నామన్నారు. జగనన్న విద్య కానుక పధకంలో విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారంలు , స్కూల్ బాగ్, షూస్ వంటివి ఉచితంగా అందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక విన్నూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో   కరోనా మహమ్మారి సమయంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి స్థాయిలో అమలు జరిగేలా ముఖ్యమంత్రి చూస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలలో 90 శాతానికి పైగా నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగమ్మోహన్ రెడ్డి కె దక్కుతుందన్నారు.  అనంతరం పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులను శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. 

కార్యక్రమంలో విద్య శాఖ అధికారులు,  వై.ఎస్.ఆర్.సీపీ పట్టణ  నాయకులు  పగడాల సత్యనారాయణ, కోటగిరి గోపాలరావు, మద్దిరాల కోటమ్మ, యూనిస్ భాష, ప్రభృతులు పాల్గొన్నారు.