గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 14 జులై 2021 (20:34 IST)

అప్పుల కుప్ప‌లు... ఆర్ధిక స్థితిపై శ్వేత ప‌త్రం ఇవ్వ‌గ‌ల‌రా?

ఆంద్ర‌ప్ర‌దేశ్ అప్పుల కుప్ప అయిపోయింద‌ని, డిసెంబర్ వరకు ఉన్న రుణ పరిమితిని ఇప్పటికే పూర్తిగా దాటేశార‌ని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ఏపీ అప్పుల్లో తప్పుడులెక్కలు బయటపడడంతో  ప్రభుత్వ పరపతి పోయింద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఆరోపించారు.

కాగ్ కడిగేసినా, మళ్లీ రుణ పరిమితి దాటేశారు ... అధిక వడ్డీలకు తెస్తూ, వేల కోట్ల అప్పులు దాచేసి పరిమితిమించి అప్పులు చేస్తారా?  ఏపీ ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? వైయస్ జగన్ అని దేవినేని ఉమ ప్ర‌శ్నించారు.