గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (19:52 IST)

శ్రీవారి హుండీలో బంగారు బిస్కెట్లు... విలువ రూ. 16 కోట్లు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడికి కానుకలకు తక్కువా. భక్తులు తాము కోరుకున్న కోర్కెలు నెరవేరితే మ్రొక్కలు సమర్పిస్తూ ఉంటారు. ఇదే చేశాడు ఒక అజ్ఞాత భక్తుడు. ఏకంగా స్వామివారికి బంగార బిస్కెట్లు కానుకగా సమర్పించాడు. అయితే ఎవరన్న విషయాన్ని మాత్రం టిటిడి అధికారులు బయటపెట్టరు. 
 
ఒక అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్లను శ్రీవారి హుండీలో సమర్పించారు. ఒక్కొక్క బిస్కెట్ 2 కిలోలు ఉంటుంది. అంటే మొత్తం 40 కిలోలని టిటిడి భావిస్తోంది. జూలై 12వ తేదీన హుండీ లెక్కింపులోనే ఇవి బయటపడినట్లు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీటి విలువ రూ.16.7 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. 
 
భక్తులు సంఖ్య తగ్గుతున్నా హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదు. కరోనా సమయంలో స్వామివారికి ఈ స్థాయిలో బంగారు బిస్కెట్లు సమర్పించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆలయం తెరిచిన తరువాత ఈ స్థాయిలో విరాళం రావడం ఇదే ప్రధమమని టిటిడి ఉన్నతాధికారులు భావిస్తున్నారు.