గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జులై 2024 (14:57 IST)

మీ కుమారుడే కాదు... మేమూ విదేశాల్లో చదువుకున్నాం... చెవిరెడ్డికి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె కౌంటర్!

dhulipalla vydeepthi
విదేశాల్లో చదువుకున్న తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసి వీధి పోరాటలకు సిద్ధం చేస్తున్నారంటూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె ధూళిపాళ్ల వైదీప్తి ఘాటుగానే కౌంటరిచ్చారు. చెవిరెడ్డిగారూ.. మీ కుమారుడు మాత్రమే కాదు.. మేం కూడా విదేశాల్లో చదువుకుని వచ్చినవాళ్లమే. గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనపై మాలాంటి వారి తల్లిదండ్రులపై వైకాపా నేతలు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టించారో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలంటూ గుర్తు చేశారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుబులోకి తీసుకుని 41ఏ కింద నోటీసులిచ్చి వదిలేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
"నా కుమారుడు వయసు 25 యేళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడు. కానీ అక్రమ కేసులో అరెస్టు చేయించారు. తద్వారా విదేశాల్లో చదివిన నా కొడుకును వీధి పోరాటలకు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగిన వాడ్ని. నన్ను మించి నా కొడుకు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు చేస్తుంటే ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి పోలీసులకు రుచి చూపించండం ఖాయం . ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైన పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం అంటూ ట్వీట్ చేశారు. 
 
దీనిపై ధూళిపాళ్ళ వైదీప్తి కౌంటరిచ్చారు. "మూడేళ్ల కింద నాకు 23 యేళ్ల వయసున్నడు నేను అమెరికాలో చదువుకుంటున్నాను. ఆ సమయంలో మా నాన్న ధూళిపాళ్ల నరేంద్రను మీ పార్టీ ప్రతీకార రాజకీయాల వల్ల అన్యాయంగా అరెస్టు చేశారు. మన విలువను నిరూపించుకోవడానికి విదేశీ డిగ్రీలు చూపించుకోవాల్సి అవసరం లేదు. మనం ఎక్కడ చదువుకున్నాం అనేది కాదు.. మనం ఎటువంటి విలువలు పాటిస్తున్నాం అనేది ముఖ్యం. గత ప్రభుత్వ హయాంలో మాలాంటి వాళ్లు చాలా మంది ఎంత బాధను అనుభించామో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను' అంటూ కౌంటరిచ్చారు.