గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (17:51 IST)

ఆ వార్తలన్నీ ఉత్తుత్తివే - సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Lakshminarayana
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా, ఆయన చేరికకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం పచ్చజెండా ఊపారంటూ ప్రచారం సాగుతోంది. గతంలో జనసేన పార్టీలో చేరిన ఆయన.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్తలపై వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఇలాంటి వార్తల కోసం మనం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఒకవేళ తాను ఏదేని పార్టీలో చేరితే ఖచ్చితంగా మీడియాకు వెల్లడిస్తానని, అంతేగానీ, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు.