శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (20:23 IST)

వైసీపీలోకి వీవీ వినాయక్.. పశ్చిమ గోదావరి నుంచి పోటీ?

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ వైసీపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. వీవీ వినాయక్ వైసీపీలో చేర్చుకోవాలని వైఎస్సార్సీపీ హైకమాండ్ సన్నాహాలు చేస్తోందట. వినాయక్‌ది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్ల. 
 
రాజకీయాల్లో అంటే ఆయన ఆసక్తి చూపిస్తున్నారని తేలడంతో పాటు పలు సందర్భాల్లో వైఎస్ జగన్ రెడ్డి ఆకాశానికెత్తేయడం లాంటివి వీవీ చేశారు. దీనిని ఉపయోగించుకుని వీవీ వినాయక్‌ను వైసీపీలో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్ వస్తోంది. 
 
పైగా.. ఇప్పుడు వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలకు కూడా వినాయక్ ఆప్తుడే. వీవీ ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డిని నేరుగా కలిసే చొరవ కూడా వీవీకి ఉంది. 
 
చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆ దిశగా ఎందుకో అడుగులు పడలేదు. జనసేనలో చేరుతారని టాక్ వచ్చింది. ఇప్పుడు అధికారికంగా సీఎం జగన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. మరోవైపు.. జగన్ పిలుపు మేరకే వినాయక్ వైసీపీలో చేరుతున్నారని టాక్.