బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 మార్చి 2020 (13:33 IST)

వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తా: సెంట్రల్ చీఫ్ లేబర్ కమిషనర్

దేశంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ కూడా వారి పిల్లల చదువుకోసం, కేంద్ర కార్మిక శాఖ నుంచి ప్రతి సంవత్సరం వచ్చే స్కాలర్షిప్ వర్తించేలా తన వంతు సహాయం చేస్తానని అని సెంట్రల్ చీఫ్ లేబర్ కమిషనర్ రాజన్న వర్మ అన్నారు.

ఢిల్లీలోని సెంట్రల్ లేబర్ కార్యాలయంలో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు రాజన్ వర్మను కలిశారు. దేశంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరి పిల్లలకు వారి చదువుల నిమిత్తం కేంద్ర కార్మిక శాఖ నుండి స్కాలర్షిప్ రూపంలో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి నగదును విడుదల చేసి అందరికీ అందేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు.

దీనికి స్పందించిన సెంట్రల్ చీఫ్ లేబర్ కమిషనర్ వర్మ ఏ డబ్ల్యూ జే ఏ ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు పంపించి అమలయ్యేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ రాజన్ వర్మకు ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. కోటేశ్వరరావు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.