శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2015 (20:47 IST)

కోటి రూపాయలకు ఐపీ పెట్టిన డాక్టర్

ఆస్పత్రి అభివృద్ధి కోసమని దాదాపు రూ. కోటి అప్పు చేసి అందరికి అరచేతిలో వైకుంఠం చూపించాడు. మొత్తం సొమ్ము సేకరించిన తరువాత ఆపై ఐపీ నోటీసులు పంపాడు ఓ వైద్యుడు. ఆయన నుంచి నోటీసులు అందుకున్న జనం షాక్ తిన్నారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది.  
 
డాక్టర్ విజయ్ (40) కొన్నేళ్లుగా నేరేడ్ మెట్ ప్రాంతంలో దంత వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. వైద్యుడిగా సేవలందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, కొంతకాలంగా ఆస్పత్రి అభివృద్ధి కోసమంటూ తెలిసిన సుమారు 15 మంది వద్ద నుంచి రూ.కోటి వరకు తెలిసిన వారందరి దగ్గర అప్పుగా తీసుకున్నాడు. దొరికిన చోటల్లా డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. చే బదుళ్ళు , బ్యాంకు రుణాలు ఒకటేమిటి అన్ని చోట్ల లాగేసుకున్నారు. ఉన్నట్లుండి ఐపీ పెట్టారు. 

అందరికీ నోటీసులు పంపారు. దీంతో అందరూ షాక్ తిన్నారు. ఆదుకుందామని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో లబోదిబోమంటున్నారు.