శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (10:54 IST)

డాల‌ర్ శేషాద్రి హ‌ఠాన్మ‌ర‌ణం టీటీడీకే కాదు, అంద‌రికీ లోటు!

డాల‌ర్ శేషాద్రి హ‌ఠాన్మ‌ర‌ణంతో తిరుపతిలో విషాదం నెల‌కొంది. రేపు మధ్యహ్నం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు జ‌రుగ‌నున్నాయని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి శేషాద్రి పార్దివదేహం బ‌య‌లుదేరుతుంది. అర్థ రాత్రికి తిరుపతికి పార్థీవదేహం చేరుకుంటుంది.


రేపు ఉదయం ప్రజల సందర్శనార్దం తిరుపతిలోని సిరిగిరి అపార్ట్మెంట్ లో పార్దీవదేహన్ని ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజాదికాల  అనంతరం తిరుపతిలోని గోవింద ధామంలో అంతిమ సంస్కారం చేస్తారు.
 
 
డాలర్ శేషాద్రి స్వామి వారి కుటుంబ సభ్యులను తిరుపతిలోని వారి నివాసం వద్ద తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప‌రామ‌ర్శించారు. డాల‌ర్ శేషాద్రి హ‌ఠాన్మ‌ర‌ణం అందినీ దుఖంలో ముంచేసింద‌ని, ఆయ‌న మృతి టీటీడీకే కాదు, త‌మంద‌రికీ తీర‌ని లోట‌ని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు.