శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (10:47 IST)

అన్న అన్నా అంటూ పలుకరించేవాడు.. శివప్రసాద్ మృతిపై మోహన్ బాబు

టీడీపీ మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ మృతిపై సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు స్పందించారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇదే అంశంపై మోహన్ బాబు ఓ ట్వీట్ చేశారు.
 
"డా.శివ ప్రసాద్ నాకు దాదాపు నలభై సంవత్సరాల నుంచి తెలుసు. 1985 - 90లలో నేను హీరోగా నటించిన 'భలే రాముడు' అనే సినిమాలో ఓ గెస్ట్ వేషంలో నటించాడు. అతను నాకు మంచి మిత్రుడు, నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త.
 
ఇటీవలే నాతో 'గాయత్రి'లో కూడా యాక్ట్ చేశాడు. ఎప్పుడు పలకరించినా అన్న అన్న అంటు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. శివప్రసాద్ మరణం నన్ను కలిచివేసింది. అతనికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.