ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 ఏప్రియల్ 2023 (13:24 IST)

ఏపీ బిష‌ప్స్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్

image
ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ (ఎ.పి.బి.సి.) గౌరవ అధ్యక్షుడిగా భారత్ బిషప్ డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ ఎంపిక‌య్యారు. విజయవాడలోని షాలెం చర్చిలో జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ బిషప్‌‌ల ప్రత్యేక సమావేశంలో రత్నకుమార్‌కు ఈ నియామక పత్రాన్ని అంద‌జేశారు. ఇప్ప‌టికే ర‌త్న‌కుమార్ భార‌త్ బిష‌ప్ గా ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆయ‌న ఈ ప‌దవిలో 2026 వ‌ర‌కు కొన‌సాగుతారు. ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 23 జిల్లాల‌లోని ల‌క్షా 70 వేల చ‌ర్చిల‌ను స‌మ‌న్వ‌య‌ప‌రుస్తూ, ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ (ఎ.పి.బి.సి.) స‌మావేశం అయింది.


ఈ బిష‌ప్స్ కౌన్సిల్ కింద ల‌క్ష మందికి పైగా పాస్ట‌ర్లుంటారు. వీరంద‌రి రాష్ట్ర ప్ర‌తినిధులుగా ఏ.పి.బి.సి. రాష్ట్ర క‌మిటీ నియామ‌కం జ‌రిగింది. ఏ.పి.బి.సి. ఛైర్మన్ గా డా.యలమంచిలి ప్రవీణ్, అధ్యక్షుడిగా వై. బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా వి. డేవిడ్ రాజు నియ‌మితుల‌య్యారు. ఇప్ప‌టికే భార‌త్ బిష‌ప్ గా సేవ‌లందిస్తూ, కాకినాడ కేంద్రంగా సిబిసిఎన్.సి ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న డాక్ట‌ర్ ముత్తాబ‌త్తుల ర‌త్న‌కుమార్ ను ఏపీ కౌన్సిల్ కు గౌర‌వ అధ్య‌క్షుడిని చేశారు.
 
క్రిస్టియ‌న్ మైనార్టీ బోర్డు ఏర్పాటుకు కృషి
ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షుడిగా ఎంపిక‌యిన డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ మాట్లాడుతూ, ఏపీ స‌ర్కిల్ లోని ల‌క్షా 70 వేల చ‌ర్చిలు, ల‌క్ష మంది పాస్ట‌ర్ల అభ్యున్న‌తికి తాను కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా క్రిస్టియ‌న్ మైనారిటీ ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేస్తాన‌ని తెలిపారు. ఏపీలో ముస్లింల‌కు వ‌క్ఫ్ బోర్డు ఉన్న‌ట్లు, క్రిస్టియ‌న్ మైనారిటీల‌కు బోర్డు ఏర్పాటు చేయాల‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసి విజ్ణ్న‌ప్తి చేస్తామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాస్ల‌ర్లకు  హాన‌రోరియం క‌ల్పిస్తూ, జీవో చేయ‌డాన్ని ర‌త్న‌కుమార్ అభినందించారు. క్రిస్టియ‌న్ మైనారిటీ స్కూళ్ళు, కాలేజీల బోధ‌నా సిబ్బందిని గ‌తంలో రీ డిప్లాయి చేసిన వారిని సీఎం జ‌గ‌న్ తిరిగి వెన‌క్కి నియ‌మాకం చేయ‌డాన్ని ర‌త్న‌కుమార్ కొనియాడారు.