సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (18:55 IST)

డ్రోన్ల సాయంతో గంజాయి పంటలు ధ్వంసం... సూపర్ ఐడియా ఫోటోలు వైరల్

Ganja farm
Ganja farm
ఏపీలో గంజాయి సాగును అరికట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం, పోలీసు శాఖ చురుకుగా పనిచేస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో గంజాయి సాగును ఎదుర్కోవడానికి డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 
 
తాజాగా డ్రోన్ల సాయంతో గంజాయి పంటను కనిపెట్టిన పోలీసు అధికారులు విజయవంతంగా ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా మాడ్గుల మండలం డేగలరాయి గ్రామంలో డ్రోన్ల ద్వారా ఐదు ఎకరాల్లో గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. 
 
ఈ పంటలను డ్రోన్ల ద్వారా నాశనం చేశారు. ఈ పంట సాగు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు డ్రోన్ల సాయంతో గంజాయి పంటను ధ్వంసం చేసిన ఫోటోలను ఏపీ పోలీసులు ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మాదకద్రవ్యాల నివారణలో టెక్నాలజీ వినియోగంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.