శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (09:19 IST)

నొప్పి లేకుండా ఎలా చనిపోవచ్చు... వీడియో చూసి ప్రాక్టికల్ చేసిన వ్యక్తి!

ఇటీవలి కాలంలో చిన్నపాటి కష్టానికే ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఓ వ్యక్తి నొప్పి లేకుండా చనిపోవడం ఎలా అనే అంశానికి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో చూశాడు. ఆ తర్వాత వీడియోలో ఉన్నట్టుగానే ప్రాక్టికల్ చేశాడు. చివరకు తనవు చాలించాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సామర్లకోటకు చెందిన లెక్కల రామచంద్రుడు (35) అనే వ్యక్తి, గత నాలుగేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాష్ రూమ్‌లోకి వెళ్లి, మెడ, చేతులపై చాకుతో కోసుకున్నాడు. ఆపై తీవ్ర రక్తస్రావమై అతను మరణించాడు.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని సెల్ ఫోన్‌ను పరిశీలించగా, పెయిన్ లేకుండా మరణించడం ఎలాగన్న విషయమై, అతను నాలుగు రోజుల పాటు వీడియోలు చూసినట్టు తెలిసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.