శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఆగస్టు 2018 (15:00 IST)

భర్తకు సెలవు దొరకలేదనీ ఉరేసుకున్న భార్య.. ఎక్కడ?

తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుని, సరదాగా బయటకు వెళ్లాలని ఆ భార్య భావించింది. ఇందుకోసం భర్తను సెలవుపెట్టుకుని ఇంటికి రావాలని కోరింది. కానీ, భర్తకు సెలవు దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి

తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుని, సరదాగా బయటకు వెళ్లాలని ఆ భార్య భావించింది. ఇందుకోసం భర్తను సెలవుపెట్టుకుని ఇంటికి రావాలని కోరింది. కానీ, భర్తకు సెలవు దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ భార్య.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బిక్కవోలు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, కర్రి మధువాణి (33) కొంతకాలంగా తిమ్మరాజుపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వెంకటేశ్వరరావు గ్రామ సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే ఈనెల 16వ తేదీన భర్త పుట్టిన రోజు. ఆ వేడుకను ఘనంగా జరుపుకుని ఆ తర్వాత సరదాగా బయటకు వెళదామని చెప్పింది. 
 
కానీ, పాఠశాలలో సెలవు దొరకలేదని బయటకు వెళ్లడానికి వీల్లేదని భార్యతో భర్త చెప్పాడు. దీంతో మనస్తాపానికి లోనైన మధువాణి.. భర్త ఇంట్లో లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరికీ గతంలో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత తమతమ భాగస్వాముల నుంచి విడాకులు తీసుకుని.. నాలుగు నెలల క్రితమే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.