శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (22:04 IST)

ప్రభుత్వానికి, ప్రజలకు న‌డుమ వారధిలా ఉద్యోగులు: మంత్రి వెలంపల్లి

ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంలో భాగంగా వార్డు సచివాలయాల‌ను ప్రారంభించిన‌ట్లు మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తెలిపారు.

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని 27వ డివిజన్ హరిజనవాడలో, 28వ డివిజన్ ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులో, 30వ‌ డివిజన్ మిల్క్ ప్రాజెక్టు వద్ద, 50వ‌ డివిజన్ మాంగో మార్కెట్, 39వ‌ డివిజన్‌లోని ద‌ళ‌వాయి సుబ్బరామయ్య మున్సిప‌ల్ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల‌ను శ‌నివారం ఉద‌యం మంత్రి  వెలంప‌ల్లి లాంఛ‌నంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ  కలలు కన్న గ్రామస్వరాజ్యం స్థాపన లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల‌ను ప్రారంభించుకోవ‌డం జరిగిందన్నారు. అవినీతికి చోటు లేకుండా ప్రభుత్వ నిర్ణయాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని ఈ సంద‌ర్భంగా ఉద్యోగులకు సూచించారు.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా సచివాలయ వార్డు ఉద్యోగులు ఉండాలని, 72 గంటల్లో సత్వర సేవలు పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేత‌లు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.