1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (07:11 IST)

రాజధాని తరలింపుపై ఉద్యోగుల మండిపాటు

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై సచివాలయం ముందు పబ్లిక్ పార్క్‌లో ఉద్యోగుల సమావేశమయ్యారు. విశాఖకు సచివాలయం తరలింపు నిర్ణయంపై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తమ సంఘాల నేతలతో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ..అప్స అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఉద్యోగులకు సర్దిచెప్పబోయారు. నేతల వ్యాఖ్యలతో ఉద్యోగులు అర్ధాంతంరంగా బయటకు వచ్చేశారు.

మీడియాతో తమగోడును వెళ్లబోసుకున్నారు. రాజధాని మార్పుపై కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతిలో రుణాలు తీసుకుని ఇళ్లు కొనుక్కున్నామని, మరో ప్రభుత్వం వస్తే విశాఖ నుంచి రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు.

తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని, రాజకీయపార్టీల మధ్య గొడవలకు మమ్మల్ని బలిచేయొద్దని ఉద్యోగులు వేడుకుంటున్నారు.
 
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
జీఎన్‌రావు, బీసీజీ రిపోర్ట్‌లను స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. విశాఖపట్టణం వెళ్లడానికి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

గతంలో ఇచ్చిన సౌకర్యాలకు అదనంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమం పొలిటికల్ పార్టీల ఉద్యమమేనని చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.