శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:51 IST)

ఏపీ డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీషు మీడియం

ఏపీలోని అన్ని డిగ్రీ కళాశాలల్లోనూ ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. ఇంజనీరింగ్‌, వైద్య విద్య కళాశాలల మాదిరిగానే సాధారణ డిగ్రీ కాలేజీల్లోనూ ఇంగ్లీషులోనే బోధన జరగాలని, ఇంగ్లీషు మాధ్యమం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను ప్రణాళికా బద్ధంగా తీసుకురావాలని సూచించారు.

డిగ్రీ మొదటి ఏడాదిలోనే దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశ పెట్టాలని తెలిపారు. అలాగే 11, 12 తరగతుల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టాలని సూచించారు. ఒకేసారి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బందులు రాకుండా పాఠ్యపుస్తకాలన్నీ ఇంగ్లీషు, తెలుగుమాధ్యమాల్లో ముద్రించాలని ఆదేశించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని సీఎం చెప్పారు. బీఏ, బీకాం లాంటి కోర్సులు చేసి.. ఇంగ్లీషులో మాట్లాడలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పోటీ ప్రపంచంలో రాణించడం కష్టం అవుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలను కల్పించే పాఠ్యప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశించారు.