ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (15:33 IST)

విషమంగానే తారకరత్న ఆరోగ్యం.. ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా నో ఎంట్రీ

tarakaratna
తీవ్ర అస్వస్థతకు లోనై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ హీరో తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులకు కూడా అనుమతించడం లేదు. అదేసమయంలో ఆస్పత్రిలో పడకపై వెంటిలేటర్‌పై ఉన్న తారకరత్న ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్రను చేపట్టారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న తారకరత్న ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి బెంగుళూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌తో పాటు అత్యాధునిక పరికరాల సాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వైద్యుల తాజాగా బులిటెన్ మేరకు తారకరత్న ఎక్మో సపోర్టుతో చితిక్స అందించడం లేదని తేలింది. 
 
మరోవైపు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. దీంతో ఆయన్ను చూసేందుకు ఐసీయూలోకి కుటుంబ సభ్యులను కూడా వైద్యులు అనుమతించడం లేదు. ఇంకోవైపు, తారకరత్న వెంటిలేటర్‌పై ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. కాగా, తారకరత్న త్వరగా కోలుకుని ఇంటికి రావాలని ఆకాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెల్సిందే.