గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 జూన్ 2024 (21:38 IST)

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

road accident
కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం జరిగింది.
 
మరణించినవారిలో 26 ఏళ్ల భూషణం, 27 ఏళ్ల ధర్మవరప్రసాద్, 32 ఏళ్ల లోవరాజు, నాగరాజు, జయరామ్ వున్నట్లు గుర్తించారు. మృతులు కోనసీమ జిల్లాకు చెందినవారు కొందరు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరికొందరు వున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఒక లారీలో పదిమంది, మరో లారీలో ఇద్దరు వున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా మంత్రి కొల్లు రవీంద్ర మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.