శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (17:06 IST)

క‌న్న‌కూతురును గొంతుకోసి చంపేసిన కసాయి తండ్రి

murder
క‌న్న‌కూతురును గొంతుకోసి చంపేశాడో క‌సాయి తండ్రి. ఈ ఘటనలో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కర్నూలు కోసిగి మండ‌లం జంపాపురంకు చెందిన మ‌ద్యానికి బానిసైన శాంతికుమార్ కొంత‌కాలంగా సైకోగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలిసింది. 
 
బుధ‌వారం ఉద‌యం త‌ల్లి ప‌క్క‌న ప‌డుకున్న పాప‌ను అతి కిరాత‌కంగా గొంతు కోసి క‌డ‌తేర్చాడు. ఈ క్ర‌మంలో ఇవాళ ఉద‌యం చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. నిద్ర‌లేచి చూసేస‌రికి కూతురు ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉండ‌డంతో త‌ల్లి సంపూర్ణ పోలీసుల‌కు స‌మాచారం అందించింది. 
 
దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి వ‌చ్చిన పోలీసులు శాంతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.