శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (14:48 IST)

సరాదాగా పేకాట.. రూ.500ల కోసం గొడవ.. హత్య.. అతడి భార్య గర్భవతి?

సరదాగా పేకాట ఆడుకుందామని వెళ్లిన స్నేహితుల మధ్య గొడవ వచ్చింది. డబ్బుల విషయంలో ఘర్షణ పడి ఒక వ్యక్తిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. హకీంపేటకు చెందిన మహ్మద్‌ జావిద్‌ పాషా(26) ఒక ఆటోడ్రైవర్‌. అతనికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. అతని భార్య ఇప్పుడు గర్భవతి.


మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన షేక్‌ సాజిద్‌, ఇంతియాజ్‌, నిజాం, సయ్యద్‌ అనే స్నేహితులతో కలిసి పేకాట ఆడటానికి జియా పాఠశాల వెనుక ఉన్న గుట్టల్లోకి వెళ్లాడు. 
 
ఆ సమయంలో వారు మద్యం తాగారు. పేకాటలో జావిద్‌ 500 రూపాయలు గెలుచుకున్నాడు. అయితే డబ్బు విషయంలో స్నేహితుల మధ్య రచ్చ వచ్చింది. దాదాపు రాత్రి 11.30 సమయంలో ఇంతియాజ్‌‌తో కలిసి స్నేహితులందరూ జావిద్‌‌పై దాడికి దిగి తీవ్రంగా కొట్టారు. ఈ తోపులాటలో బాధితుడు రాయిపై పడ్డాడు. తీవ్రంగా గాయపడటంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 
 
వెంటనే హకీంపేటలోని ఆల్‌నూర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో నానల్‌నగర్‌లోని ఆలివ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సోదరుడు షేక్‌ జహంగీర్‌ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.