శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (18:52 IST)

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

fire accident
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండో శనివారం కావడంతో సిబ్బంది ఎవరూ విధుల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగారు. 
 
కాగా.. కలెక్టరేట్‌లో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి మొత్తం మంటల్లో పడి దగ్ధమైంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.