1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (09:04 IST)

గుంటూరు ఆస్పత్రిలో తొలి శిశు గుండె ఆపరేషన్.. వైద్య బృందానికి అభినందనల వెల్లువ

జిల్లా కేంద్రమైన గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో తొలి శిశు గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేయగా, ఈ ఆస్పత్రిలో ప్రతి రోజూ ముగ్గురు శిశువులకు చికిత్స చే

జిల్లా కేంద్రమైన గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో తొలి శిశు గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేయగా, ఈ ఆస్పత్రిలో ప్రతి రోజూ ముగ్గురు శిశువులకు చికిత్స చేయగల సామర్ధ్యం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా, చీరాల మండలం పందిళ్లపల్లికి చెందిన దంపతులు గోపి, ఏసుమణి కుమారుడు నాలుగేశ్ల బెన్ని సాల్మనకు బుధవారం ఉదయం సహృదయ ట్రస్ట్‌ డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో హృదయ శస్త్రచికిత్సను నిర్వహించినట్టు తెలిపారు. 
 
రాష్ట్రంలోనే ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి శస్త్రచికిత్స నిర్వహించడం తొలిసారి అన్నారు. సుమారు రూ.2 లక్షలు ఖర్చయ్యే ఈ చికిత్సను ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తామన్నారు. చికిత్స చేసిన గోఖలేతో పాటు ఆయన బృదంలోని డాక్టర్లు డీవీ రమణ, శ్రీనివాసులు, వై.ఉషారాణి, కె.సుధాకర్‌, సుష్మాగాయత్రిని ప్రత్యేకంగా సన్మానించారు.