శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (10:30 IST)

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుమంది కూలీలు మృతి

అనంతపురం జిల్లా పామిడి పట్టణ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీల తో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదం లో ఏకంగా ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…అనంతపురం నుంచి పామిడి పట్టాణానికి… ఓ ఆటో కూలీలతో వస్తోంది. 8 మంది కూలీలు ఆటోలు పామిడికి వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలోనే.. పామిడి పట్టణం నుంచి వస్తున్న…. ఓ లోడ్‌ లారీ… ఆ ఆటోను ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే.. ఆటోలో ఉన్న ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలకొండ వాసులుగా గుర్తించారు. 
 
మరో ముగ్గురు తీవ్రం గా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే… ఈ విషయం తెలిసిన పోలీసులు.. ఘటన చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ తప్పిదం కారణంగానే.. ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.