మహిళలకు కథలు చెప్పి లోబరుచుకుని అత్యాచారం... కర్చీఫ్‌తో గొంతు బిగించి హత్య... తూగోలో కిరాతక చర్య

శనివారం, 14 జనవరి 2017 (10:26 IST)

sadist

తూర్పుగోదావరి జిల్లాలో ఓ కిరాతకుడు చేసిన చేసిన దుశ్చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ కిరాతకుడు నోరు తెరచి కథ మొదలు పెట్టాడంటే ఎవరైనా లీనమై పోవాల్సిందే. మహిళలను టార్గెట్ చేసుకుని, వారిని తన గానంతో వశపరచుకుని, శారీరకంగా అనుభవించి, అంతటితో వదలకుండా హత్య చేసి, వారి ఒంటిపై ఉండే నగలను దోచుకోవడం ఇతని అలవాటు. ఒకటి, రెండు కాదు. ఏకంగా ఐదుగురు యువతులపై అత్యాచారం చేసి హత్యలు చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామానికి చెందిన వివాహిత చేవూరి భాగ్యవతి అదృశ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఈ కేసుపై ఆరా తీశాయి. దీనిపై అమలాపురం డీఎస్పీ ఎల్‌.అంకయ్య వెల్లడిస్తూ అమాయక మహిళలకు కథలు చెప్పి వారిని లోబరచుకుంటాడని తెలిపారు. భాగ్యవతితో పరిచయం పెంచుకుని, ఆమెను 8వ తేదీన ఇసుక దిబ్బల్లోకి తీసుకెళ్లి, అత్యాచారం చేసి, ఆపై కర్చీఫ్‌తో గొంతు బిగించి చంపాడని, ఆమె ఒంటిపై ఉన్న నగలు అపహరించాడని వెల్లడించారు.
 
తమ విచారణలో భాగంగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని మద్దురిలంకకు చెందిన ఆకుల నాగమణి (40), యానాంకు చెందిన సత్యవతి, దంగేరుకు చెందిన ఓ వివాహితతో పాటు మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన బద్రి సత్యవతిలను ఇదే పద్ధతిలో నిందితుడు కడ తేర్చాడని, అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నారావారిపల్లిలో కుటుంబ సభ్యుల బాబు సంక్రాంతి వేడుకలు

టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి ...

news

తెలుగుదేశం పార్టీని చిరంజీవి టార్గెట్ చేశారు... ఎలా...?

మెగాస్టార్ చిరంజీవి. పదేళ్ళ పాటు రాజకీయాల్లో ఉండి చివరకు తాను కింగ్‌గా ఉన్న ...

news

మంత్రి ఇలాకాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు... చంద్రబాబుకు తలనొప్పి!

సాక్షాత్తు మంత్రి ఇలాకాలోనే అధికారపార్టీలలో ఆధిపత్య పోరు జరుగుతోంది. అది కూడా ఎక్కడో కాదు ...

news

మద్యం సేవంచే రాజకీయ నేతలను ఉరితీయాలి : సెనేటర్ షాహీ సయ్యద్

పాకిస్థాన్ దేశంలోని అవామీ నేషనల్ పార్టీకి చెందిన షాహీ సయ్యద్ అనే సెనేటర్ ఓ సంచలన ప్రకటన ...