బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (09:21 IST)

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి  పెరిగింది. దీంతో అధికారులు 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ప్లో 1,71,377 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో 1,76,034 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది.

పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం  215 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటినిల్వ 214.8450 టీఎంసీలకు చేరింది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

తుంగభద్రలో ...
తుంగభద్ర నదీ ప్రవాహంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి సుంకేసుల జలాశయానికి 41,250 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

ఈ జలాశయం 9గేట్లు ఎత్తి 39,800 క్యూసెక్కుల నీటిని దిగవకు నదిలోకి వదులుతున్నట్లు నీటి పారుదల శాఖ మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది ఒడ్డుకు రావద్దని ఎస్‌ఈ సూచించారు.