శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (20:09 IST)

ఏపీలో దారుణం: నాలుగో తరగతి బాలికపై వృద్ధుడి అత్యాచారం

రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధుల దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
నిందితుడి కుమార్తెతో పాటు బాలిక 4వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో జ్వరం, ఒళ్లు నొప్పులతో బాలిక బాధపడుతుండటంతో వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆ బాలిక తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.