శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 13 జూన్ 2017 (13:42 IST)

గాజువాక రోడ్డుపై... మగ సీఐ వర్సెస్ స్త్రీ ఎస్ఐ... అసలేం జరిగింది?

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకూడదంటూ చెప్పే పోలీసులే ఉల్లంఘిస్తే ఏమవుతుంది..? ఇలాగే జరుగుతుంది. విశాఖపట్టణం గాజువాకలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన చేసేందుకు సీఐ కేశవరావు సెంటర్లో వున్నారు. ప్రజలకు నిబంధనలు గురించి చెపుతూ వుండగా ఓ మహిళ ఇద్దరు పి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకూడదంటూ చెప్పే పోలీసులే ఉల్లంఘిస్తే ఏమవుతుంది..? ఇలాగే జరుగుతుంది. విశాఖపట్టణం గాజువాకలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన చేసేందుకు సీఐ కేశవరావు సెంటర్లో వున్నారు. ప్రజలకు నిబంధనలు గురించి చెపుతూ వుండగా ఓ మహిళ ఇద్దరు పిల్లల్ని స్కూటరుపై ఎక్కించుకుని రాంగ్ రూట్లో వచ్చేస్తోంది. దీంతో సీఐ వెంటనే ఆమెను ఆపారు. రాంగ్ రూట్లో రావడం ప్రమాదమనీ, అది కూడా ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకుని వాహనం నడపటం ప్రమాదకరమని అన్నారు. 
 
ఆయన మాటలకు సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. తను ఓ మహిళా ఎస్సైననీ, అలాంటిది తన పట్ల మీ ప్రవర్తన ఏం బాగాలేదని ఆగ్రహించింది. నిబంధనలను అతిక్రమించేవారు ఎంతటివారైనా తప్పేననీ, మీ వాహనం కాగితాలు చూపించాలని కేశవరావు కోరారు. తన వద్ద పత్రాలు లేవనీ, ఇంట్లో పెట్టి వచ్చానంటూ ఆమె అన్నారు. 
 
ఆమె సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేశవరావు, పిల్లలతో వున్నారు కాబట్టి వదిలేస్తున్నా... ఐనా నిబంధనలు అతిక్రమించినందుకు మీపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారాయన. మీపై కంప్లైంట్ ఇస్తానంటూ మహిళా ఎస్సై వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లిపోయారు.