సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (11:17 IST)

అచ్యుతాపురం సెజ్‌లో విష వాయువులు లీక్.. 100 మందికి అస్వస్థత

gas leak
అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువులు లీకైనాయి. ఈ ఘటనలో 100కి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. బ్రాండిక్స్‌ సీడ్స్‌–2 కంపెనీలో ఈ వందమంది పనిచేస్తున్నారు. 
 
మంగళవారం రెండో షిఫ్ట్‌లో సుమారు 2 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు టీ బ్రేక్‌ సమయంలో ఒక్కసారిగా గ్యాస్‌ లీకవడంతో ఉద్యోగినులకు శ్వాస తీసుకోవడం కష్టమైంది.
 
వాంతులు, వికారంతో అనేకమంది స్పృహ తప్పి పడిపోయారు. అక్కడి వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. 45 మందిని అనకాపల్లి ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించారు. తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులు రంగంలోకి దిగారు.