గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (09:19 IST)

ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం

pootharekulu
ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం దక్కింది. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థన్ కాటన్ పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు చేసింది.
 
ఫిబ్రవరి 13 వరకు జీఐ ఇచ్చిన గడువు పూర్తి కావడంతో పాటు ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ఎలాంటి అభ్యంతరాలు కూడా రాకపోవడంతో... కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో పూతరేకులు నమోదయ్యాయి. వాటికి భౌగోళిక గుర్తింపు లభించినట్టు సర్ అర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం తెలిపింది.