మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (13:15 IST)

విశాఖలో అరుదైన నాగుపాము... పడగ మాత్రం బంగారు వర్ణం

Snake
Snake
విశాఖపట్నంలో అరుదైన నాగుపాము కనిపించింది. యారాడ నేవీ ఉద్యోగుల క్వార్టర్స్‌లో పాము పడగ మొత్తం బంగారు వర్ణంలో గల పామును గుర్తించారు. ఓ ఉద్యోగి కార్ షెడ్‌లో ఈ పాము కనిపించింది. 
 
కారు బయటకు తీస్తున్న సమయంలో ఈ పామును చూసిన సదరు ఉద్యోగి స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఫోన్‌లో సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న నాగరాజు ఈ పామును బంధించారు.
 
పడగకు ముందు వెనుక మాత్రమే బంగారు వర్ణంలో, మిగతా భాగం మొత్తం సాధారణంగా ఉండడం విశేషం. ఈ అరుదైన పామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం స్నేక్ క్యాచర్ నాగరాజు ఈ పామును జనావాసాలకు దూరంగా వదిలిపెట్టారు.