శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (08:35 IST)

ఏపీ మందు బాబులకు గుడ్‌న్యూస్!

ఏపీలోని మద్యం బాబులకు ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్ అందించబోతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉన్నట్టు సమాచారం. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75 శాతం ధరలను పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
 
అయితే మద్యపాన నిషేదంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి అది కాస్త ఇంకో ప్రమాదాన్ని తెచ్చేలా ఉన్నట్టు కనిపించింది. ధరలు పెరగడం, కొన్ని చోట్ల మద్యం దొరకకపోవడంతో కొంత మంది శానిటైజర్ తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
అయితే మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్‌‌ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు సమాచారం అందించారు. 
 
ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుందని అందుకే మద్యంపై కనీసం 30 నుంచి 40 శాతం మేర మద్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది.