ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మొత్తం వెయ్యిమందికి ప్రమోషన్ లభించనుంది. ఇక అధికారుల కంటే కార్మికులు, ఉద్యోగులకు ఎక్కవగా పదోన్నతులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఆర్జీసీలో పనిచేస్తున్న మెకానిక్ లు, సీనియర్ అసిస్టెంట్‌లు, డిపోమేనేజర్లు, ట్రాఫిక్ సూపర్ వైజర్లు మరికొందరు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పదోన్నతుల అంశాన్ని ఏపీ ఆర్టీసీ సూత్రాపాయంగా ఆమోదించింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరవాత మొదటి సారి పదోన్నతులు కల్పించనున్నారు. ఈ నెలాఖరువరకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.