బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2024 (11:11 IST)

తెల్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు- నాదెండ్ల

nadendla manohar
ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ పంపిణీలో వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. 
 
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంను వైసీపీ పెద్దలు దారి మళ్లించి కోట్లాది రూపాయల అక్రమాలు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ చర్యల వల్ల పౌర సరఫరాల శాఖకు భారీగా నష్టం జరిగిందని చెప్పారు. 
 
డోర్ డెలివరీ పేరుతో ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేసినా ఎక్కడా డోర్ డెలివరీ జరగడం లేదని మంత్రి నాదెండ్ల అన్నారు. పేదలకు అందాల్సిన రేషన్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
 
వచ్చే నెల నుండి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను రేషన్ కార్డులకు పంపిణీ చేస్తామని చెప్పారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.