గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 17 మార్చి 2024 (19:18 IST)

ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టారు: చంద్రబాబు

Chandrababu
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు వైసిపి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. '' అసమర్థ, అవినీతికర పాలన మూలంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది. ప్రభుత్వ భవనాలు, కాలేజీ భవనాలు సైతం తాకట్టు పెట్టబడ్డాయి. మద్యం ఏరులై పారుతోంది. ప్రజలకు భవిష్యత్తు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని నిలబెట్టడానికే ఈ పొత్తు'' అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
 
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ప్రజాగళం సభా ప్రాంగణానికి విచ్చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు స్వాగతం పలికారు. సభకు విచ్చేసిన లక్షలాది మందికి అభివాదం చేస్తూ ప్రధాని మోడీ.. వేదికపైకి వచ్చారు. భారీగా తరలి వచ్చిన తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలతో బొప్పూడి జనసంద్రంగా మారింది.
 
బొప్పూడి వద్ద పార్కింగ్ ప్రాంతాల్లోకి వాహనాలు మళ్లించడంలో పోలీసుల వైఫల్యం చెందారు. దీనితో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సభా వేదిక వద్దకు చేరుకునేందుకు కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.