మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 20 జులై 2021 (16:33 IST)

ముస్లిం సోద‌రుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు

బక్రీద్ (ఇద్-ఉల్-అజా) సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ‌ భూషన్ హరిచందన్ ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సందేశం పంపారు.
 
"బక్రీద్ (ఇద్-ఉల్-అజా) పండుగ శుభ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం సోదరులందరికీ 
నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రీద్ పండుగ ఇస్లామిక్ మతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ పండుగను ప్రత్యేక ప్రార్థనలు భక్తి భావాలతో జరుపుకుంటారు.
బక్రిద్ పండుగ  త్యాగనిరతి,  దేవుని పట్ల సంపూర్ణ భక్తి, విశ్వాసం, పేదల పట్ల కరుణ, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
 
మాస్క్  ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ” అని గ‌వ‌ర్న‌ర్  బిశ్వ‌ భూషన్ హరిచందన్ విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్ నుంచి త‌న సందేశాన్ని తెలిపారు.