శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (10:04 IST)

గ్రామ వాలంటీర్ల‌కు అనూహ్య స్పంద‌న‌

ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన గ్రామ వాలంటీర్ల‌కు అనూహ్య స్పంద‌న‌ వస్తోంది. గత 8 రోజుల్లో 5లక్షల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ వెబ్‌సైట్‌కు పోటెత్తిన వీక్ష‌కుల సంఖ్య 15 లక్షల వరకు ఉంది. 
 
ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆలోచ‌నావిష్క‌ర‌ణ‌కు అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు. ఈ వెబ్‌సైట్‌ను ఆర్టీజీఎస్‌ ఆవిష్కరించింది. గ్రామ వాలంటీర్ కోసం అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే వెసులుబాటువుంది. అభ్యర్థులు సరిగ్గా దరకాస్తులు పూరించక తిరస్కరించిన ధరకాస్తులు 18  వేలకుపైగా ఉంది. 
 
వీరంతా లాగిన్లోకి వెళ్లి పొరబాట్లను సరిదిద్దుకోవాల్సివుంది. తిరస్కరణకు గురైన దరకాస్తుదారులకు ఫోన్ చేసి పోరాబాట్లు లేకుండా మళ్ళీ దరకాస్తూ చేసుకునేలా సహకరిస్తున్న ఆర్టీజీఎస్ వెల్లడించింది. పైగా, చివరి తేదీలోపు అభ్యర్థులు ఎలాంటి తప్పులు, పోరాబాట్లు లేకుండా దరఖాస్తులు చేసుకుని ఆన్‌లైన్‌లో అప్లై చేయాలని కోరుతోంది.