Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫోన్ తీయలేదనీ భార్య తలను గోడకేసికొట్టిన కసాయి భర్త

గురువారం, 29 జూన్ 2017 (08:47 IST)

Widgets Magazine
sadist

గుంటూరు జిల్లా సంగడిగుంటలో ఓ దారుణం జరిగింది. ఫోను తీయలేదన్న కోపంతో భార్య తలను ఓ ప్రబుద్ధుడు గోడకేసికొట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన చండ్ర మల్లికార్జునరావు ఐదేళ్ళ క్రితం ఆత్మకూరుకు చెందిన పద్మ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. 20 రోజుల నుంచి కుమార్తెకు మెదడులో సమస్య ప్రారంభమైంది. అప్పటి నుంచి వివిధ ఆసుపత్రులు తిరుగుతూ ఐదు రోజుల క్రితం గుంటూరు జనరల్ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు ఆధార్‌, రేషన్‌ కార్డులు తీసుకురావాలని కోరవడంతో భర్త తన స్వగ్రామం వెళ్లాడు.
 
అక్కడ తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయావు కాబట్టి ఆధార్‌, రేషన్‌లు కార్డులు ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో వెనుదిరిగి వస్తూ భార్యకు ఫోన్‌ చేయగా ఆమె ఫోన్‌ తీయలేదు. దీంతో ఆగ్రహంతో ఆస్పత్రిలోని న్యూరాలజీ వార్డుకు వచ్చి భార్యను తలపట్టుకొని గోడకేసి కొట్టాడు. 
 
తలకు గాయం కావడంతో వెంటనే ఆమెను క్యాజువాలిటీకి తీసుకువచ్చి చికిత్స చేశారు. ఆమెను గాయపరచడం చూసిన అదే వార్డులోని మహిళలందరూ కలిసి మల్లికార్జునరావును చితకబాదారు. అనంతరం అవుట్‌ పోస్ట్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అయిదు రూపాయలకే భోజనం. ఇప్పుడు రూ. 1కే లీటర్ మినరల్ వాటర్..

గత సంవత్సర కాలంగా రూ. 5లకే భోజనంతో భాగ్యనగరంలో వేలాది మంది ఆకలి తీరుస్తోన్న గ్రేటర్ ...

news

మొదట మూడు వస్తువులు పంపారు.. తర్వాత మూడు నామాలు పెట్టారు. దేవుడి పేరుతో ఠోకరా

చెయిన్ వ్యాపారం అంటే గొలుసుకట్టు వ్యాపారం అని తెలుసు కదా. మొదట ముగ్గురికి చెప్పండి. ఆ ...

news

వాళ్లను చూసి పోలీసులే వణికిపోయారు.. గేటు బయటి నుంచే పంపించేసారు.. ఏం బతుకురా మీది?

నడమంత్రపు సిరికి అధికారం తోడయినప్పుడు మన సమాజ గర్భం నుంచే పుట్టుకొచ్చిన కుక్కమూతి పిందెలు ...

news

ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్‌ ప్రైజ్‌ ఇస్తారా? ఇదేంది 'బాబు' గోరూ....

తెలుగుదేశం పార్టీలో నాయకుల నాలుక మడతపడటం, నోరు జారడం అధినేత నుంచి ఆయన తనయుడినుంచి కింది ...

Widgets Magazine