సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (16:04 IST)

Loan App: లోన్ యాప్ వేధింపులు భరించలేక.. శిఖరేశ్వరం గోడపై.. అడవిలో రాత్రంతా?

Loan App
Loan App
లోన్ యాప్‌ల వేధింపులకు ప్రాణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. లోన్ యాప్‌ల కారణంగా అటు డబ్బులు కట్టలేక, ఇటు వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. గుంటూరు జిల్లాకి చెందిన ఓ యువతి కూడా ఇలానే లోన్ యాప్స్ నుంచి డబ్బులు వాడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కలుకులూరు గ్రామానికి చెందిన  వెన్నెల.. శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర వెన్నెల అనే యువతి లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. నిన్న సాయంత్రం శిఖరేశ్వరం గోడ పైనుంచి 10 అడుగుల లోతులో ఉన్న అడవిలోకి దూకింది. దీంతో రాత్రంతా ఆ శిఖరేశ్వరం అడవిలోనే గడిపింది. 
 
ఇంట్లో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను శిఖరేశ్వరం అడవిలో యువతిని శ్రీశైలం పోలీసులు గుర్తించారు. సురక్షితంగా యువతిని అడవి నుంచి తీసుకొచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.