శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 5 జూన్ 2021 (10:04 IST)

గుంటూరు కిరాణ, బడ్డీ కొట్టుల్లో గుట్కా ప్యాకెట్లు

గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో గుట్కా మరియు ఖైనీ వంటి నిషేధిత పదార్దాలను విక్రయిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతూ కఠిన చర్యలు తీసుకోవలసిందిగా మరియు గుట్కా విక్రయిస్తూ పట్టుబడిన పాత నేరస్థులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహించాలని, 06.06.2021 తేదీ వరకు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో గుట్కా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపిఎస్ గారు.

ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలు మరియు నగరాలలోని కిరాణా దుకాణాలు, బడ్డీ కొట్లు, కిళ్లీ షాపులు మరియు ఇతర అనుమానిత ప్రదేశాలలో ముమ్మర తనిఖీలు నిర్వహించడం జరిగినది.
 
అక్రమార్కులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి గుట్కా మరియు ఖైనీ వంటి నిషేధిత పదార్దాలను తరలించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో కొన్ని వాహనాలను,
ముఖ్యముగా ఇతర రాష్ట్రాలు మరియు ఇతర జిల్లాల నుండి గుంటూరు రూరల్ జిల్లాకు పార్సిళ్లను తీసుకువచ్చే వాహనాలను మరియు సంబంధిత ఆఫీసులు,స్టాక్ పాయింట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగినది.ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.
 
అదేవిధంగా గతములో గుట్కా విక్రయిస్తూ పట్టుబడిన వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు పిలిపించి, కౌన్సెలింగ్ నిర్వహించి,ఇక నుండి గుట్కా మరియు ఖైని వంటి నిషేధిత పదార్థాలు విక్రయించడం వంటి చట్ట వ్యతిరే కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది.
 
గుట్కా, ఖైని వంటి నిషేధిత పదార్థాలను తరలించకుండా, విక్రయించకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయడం జరిగినదని,ఎవరైనా గుట్కా మరియు ఖైని వంటి నిషేధిత పదార్దాలను విక్రయించిన మరియు రవాణా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్చరించడం జరిగినది.
 
ఈ రోజు నిర్వహించిన దాడుల్లో గురజాల, క్రోసూరు, గురజాలలో మొత్తం 4 కేసులు నమోదు చేసి,1,06,230/- విలువ కలిగిన 18800 గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకుని సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగినది.