గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (14:53 IST)

ఏపీలో 4 నుంచి ఒక్కపూట బడులు - ఉదయం 7.30 గంటలకే స్కూల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలకే రోడ్డుపైకి రావాలంటే జంకుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. 
 
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఒక్కపూట బడులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. 
 
అలాగే, ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే, ఏపీలో ఒక్కపూట బడులు ప్రారంభం రోజునే రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి పరిపాలన కూడా ప్రారంభంకానుంది.