Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పన్నీర్ సెల్వం హ్యాట్రిక్ రాజీనామాలు.. తమిళనాడు సీఎంగా 7న శశికళ ప్రమాణం

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (16:22 IST)

Widgets Magazine
opanneerselvam1

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఓ పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీఎంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఈనెల 7వ తేదీన ప్రమాణం చేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. 7వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అన్నా డీఎంకే శ్రేణులు చెబుతున్నాయి. అలాగే, ప్రమాణ స్వీకార తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. 
 
పన్నీర్ సెల్వం మంత్రి వర్గంలోని చాలా మందికి ఉద్వాసన పలుకుతారని, భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు స్థాన చలనం కలుగుతుందని తెలుస్తోంది. అదేవిధంగా, అన్నాడీఎంకే పార్టీలోని అసంతృప్తులను శశికళ బుజ్జగించనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కాగా, తమిళనాడు సీఎంగా తానే కొనసాగాలని భావించిన పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ఒక వర్గాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు రావడం, ఈ ప్రయత్నాలు శశికళకు నచ్చకపోవడం తెలిసిందే.
 
అంతకుముందు.. అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఇందులో పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళ పేరును పన్నీర్ సెల్వం తొలుత ప్రదిపాదించగా, మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేతగా శశికళ ఎన్నికైన  విషయాన్ని శశికళకు పన్నీర్ తెలియజేశారు. 
 
కాగా, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన అక్కడి నుంచి రాగానే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికున్న తీర్మానాన్ని అందజేయనున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Panneerselvam Resigns Hat-trick Third Time Tamil Nadu Chief Minister

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీఎం పదవికి పన్నీర్ సెల్వం రిజైన్... తమిళనాడు శాసనసభాపక్షనేతగా శశికళ ఏకగ్రీవం

తమిళనాడు శాసనసభాపక్షనేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం ...

news

ప్రత్యేక హోదా ఏమైనా చాక్లెటా.. అడిగిందే ఇవ్వడానికి.. మంత్రి మాణిక్యాల రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేక హోదా ...

news

ఆధార్ కార్డుల్లో తప్పులా.. మీరే సరిచేసుకోండి

ఇప్పుడు మీరే మీ ఆధార్ కార్డు మార్పులు చేయవచ్చు. మీరు ఇంతకుమందు ఇచ్చిన సమాచారంలో ఏమైనా ...

news

మీ శాఖను నారా లోకేష్‌కు ఇచ్చేస్తారా... మంత్రి బొజ్జకు మీడియా ప్రశ్న

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ...

Widgets Magazine