బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (09:04 IST)

చంద్రబాబుకు అలర్జీ సమస్య : రాజమండ్రి జైలు డిఎస్పీ

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అలెర్జీ సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారని రాజమండ్రి డిప్యూటీ సూపరింటిండెంట్ రాజ్ కుమార్ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉక్కపోత, అధిక వేడిమి ఉన్న కారణంగా డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. దీంతో స్కిన్ స్పెషలిస్ట్‌లను పిలిపించారమని ఆయన వెల్లడించారు. విపరీతమైన ఉక్కపోత, అధిక వేడిమి కారణంగానే ఆయన డీహైడ్రేషన్‌కు గురికావడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. 
 
తనకు అలర్జీ సమస్య ఉదంని చంద్రబాబు చెప్పడంతో స్కిల్ స్పెషలిస్టులను పిలిపించామని తెలిపారు. వైద్యులు చంద్రబాబును పరీక్షించారని, చంద్రబాబుకు అలర్జీ సమస్య ఉందని వారు గుర్తించారని చెప్పారు. చంద్రబాబుకు కొన్ని మందులు సూచించారని, వైద్యులు సూచించిన మందులను చంద్రబాబుకు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.