జర్నలిస్టులకు ఫిబ్రవరి 5న ఉచిత వైద్య శిబిరం

doctor
ఎం| Last Updated: బుధవారం, 29 జనవరి 2020 (16:24 IST)
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కృష్ణా అర్బన్ యూనిట్, ఆంధ్ర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఉచితవైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ శిబిరంలో హార్ట్, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు కేవలం యాభై మందికి మాత్రమే ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు.

కావున ఈ అవకాశాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు ఫిబ్రవరి 3వ తేదీలోగా తమ పేర్లను ప్రెస్ క్లబ్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 9.30 గంటలకు వైద్య శిబిరం ప్రారంభమవుతుందని ప్రకటనలో వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :