సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:49 IST)

విశాఖ తీరానికి కొట్టుకొని వచ్చిన భారీ నౌక, చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు

విశాఖ తెన్నేటి పార్క్ వద్ద సముద్రపు ఒడ్డుకి ఓ భారీ నౌక కొట్టుకొని రావడంతో దాన్ని చూడడాని స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ భారీ నౌక బంగ్లాదేశ్‌కు చెందిందని సమాచారం. గత రాత్రి గాలులు తాకిడి అధికంగా ఉండడంతో ఇది ఇలా అదుపు కోల్పోయి తీరానికి కొట్టుకొని వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 
అలల తాకిడికి ఔటర్ హార్బర్లో యాంకర్ తెగి ఒడ్డుకు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది తీరానికి సమీపంలో ఇసుకలో కూరుకుపోయింది. అందులో దాదాపు 15 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, పోర్టు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.