గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (13:07 IST)

బెజవాడలో కుండపోత.. నదిని తలపిస్తున్న రోడ్లు (video)

AP Rains
AP Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బెజవాడలో భారీ వర్షాలు కురిశాయి. వాయుగుండం ప్రభావంతో శనివారం పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. శనివారం నుంచి కురిసిన జడివాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 62,550 హెక్టార్లలో పంట ముంపుబారిన పడినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 9 మంది చనిపోయారు.

ఇంకా వర్షాలకు తిరుమలలో ఓ భారీ వృక్షం కూలడంతో భక్తురాలు తీవ్రగాయాలపాలయ్యారు. ఏఎంసీ ప్రాంతంలోని 305వ కాటేజీ వద్ద చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి కూర్చొని ఉండగా, సమీపంలోని భారీ వృక్షం కూలిపోయింది. చెట్టు కొమ్మలు ఆమెకు తగలడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

అలాగే కాకినాడ జిల్లాకు వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాకినాడ పోర్టు నుంచి మూడోరోజు కూడా విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి.