బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (12:59 IST)

తిరుమలపై భక్తుల రద్దీ.. శ్రీవారికి రూ.4.56 కోట్ల హుండీ ఆదాయం

Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తుతోంది. 62,407 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 33,895 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 
 
సెలవు దినాలు కావడంతో శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.
 
సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దీంతో గురువారం శ్రీవారికి రూ.4.56 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది.