గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (18:02 IST)

ఏపీలోని ఆరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో శనివారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 
 
ప్రధానంగా వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల, కర్నూలు తదితర జిల్లాల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
అలాగే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షపు జల్లులు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.