బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (12:08 IST)

రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో కృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ

krishna - rajiv
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జీవించివున్న సమయంలో ఆయన ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ ఒకమారు లోక్‌సభ సభ్యుడుగా కూడా ఉన్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి బోళ్ళ బుల్లిరామయ్యపై 71 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, రాజీవ్ గాంధీ హత్యానంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 
 
అయితే, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ మద్దతు ఇస్తూనే ఉన్నారు. గత 2004 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డికి మద్దతు తెలిపారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌కు అండగా ఉన్న కృష్ణ.. ఆ తర్వాతి కాలంలో ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. 
 
అంతేకుండా, 1972లో ఆయన జై ఆంధ్ర ఉద్యమానికి సూపర్ స్టార్ బహిరంగంగా మద్దతు ప్రకటింటారు. అదేసమయంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయడం, తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లడం జరిగింది. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ సమయంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు.